Gam Gam Ganesha OTT: ‘బేబీ’ సినిమా ఘనవిజయం తర్వాత ఆనంద్ దేవరకొండ గం గం గణేశ అనే క్రైమ్ కామెడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ చిత్రం థియేటర్ లో పెద్దగా ఆడలేదు ఇక ఇప్పుడు ఎటువంటి ప్రకటన లేకుండా, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ప్రైమ్ వీడియో ఇంతకముందు చాల సార్లు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా విడుదల చేసిన సినిమాలు చాల సినిమాలున్నాయి. మరి OTTలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక,ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా, సంగీతం చైతన్ భరద్వాజ్, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ చేసారు, కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు.