Nindha Movie Review Telugu: హ్యాపీ డేస్ సినిమా ఫేమ్ వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత నింద సినిమాతో తిరిగి వచ్చాడు. ఈ నింద మూవీ ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
వరుణ్ సందేశ్ తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి సినిమా చేయలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈరోజు విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూ లో తెల్సుకుందాం.
కండ్రకోట గ్రామంలో మంజు అనే యువతి దారుణ హత్యకు గురికావడంతో పోలీసులు బాలరాజు (ఛత్రపతి శేఖర్) ని అరెస్ట్ చేస్తారు. న్యాయమూర్తి అయిన సత్యానందం (తనికెళ్ల భరణి) అతనికి మరణశిక్ష విధిస్తారు. బాలరాజు నేరం చేయలేదని సత్యానందంకి తెలియడంతో మనస్తాపానికి గురవుతాడు. ఇక తన కొడుకు అయిన వివేక్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అధికారి ఈ కేసు గురించి చెప్తాడు, ఇక చివరగా ఈ కేసు ని వివేక్ ఎలా ఛేదించాడు అనేది సినిమా చూసి తెల్సుకోవాలి.
సినిమా మంచి సన్నివేశంతో మొదలవుతుంది, ప్రారంభ భాగంలో పాత్రలను పరిచయం చేసిన విధానం బాగుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ, నత్త నడకన సాగే స్క్రీన్‌ప్లే మనకు బోర్‌గా అనిపిస్తుంది.
స్క్రీన్‌ప్లేలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ, ఈ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగున్నాయి, వాటి వాళ్ళ సినిమా ని చివరి వరకు చూసేలా చేస్తుంది.
వివేక్‌గా వరుణ్ సందేశ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఛత్రపతి శేఖర్, రాజన్న ఫేమ్ ఆని , తనికెళ్ల భరణి తమ పాత్రల మేరకు బాగా చేసారు.
డెబ్యూ డైరెక్టర్ రాజేష్ జగన్నాథ్ ఈ చిత్రాన్ని డీసెంట్ గా ప్రెసెంట్ చేసాడు. అయితే స్క్రీన్‌ప్లేలో లోపాలున్నప్పటికీ, ప్రేక్షకులను కట్టిపడేయడంలో కొంతమేరకు సఫలమయ్యాడు.
రమీజ్ సినిమాటోగ్రఫీ బాగుంది మరియు ఓంకార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ ఇంకా బాగుండాల్సింది.
ఓవరాల్‌గా, నిందా ఒక మంచి థ్రిల్లర్ అయినప్పటికీ స్లో-పేస్డ్ కథనం ఒక్కటి మైనస్ గా అనిపిస్తుంది.