నటుడు నవదీప్‌కు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాడు. అతను గత కొన్నేళ్లుగా చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్‌లో కనిపించడం మరియు కొన్ని వెబ్ సీరియస్లు చేయడం లాంటివి చేసాడు. ఇక ఇప్పుడు చాల సంవత్సరాల తరువాత నవదీప్ ౨. o గా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.
చాలా కాలం నుండి నిర్మాణంలో ఉన్న “లవ్ మౌళి” చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. ఇక ఇప్పుడు జూన్ 27, 2024న ఆహా వీడియో OTT ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ ప్రీమియర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
నవదీప్ మరియు పంఖూరి గిద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన “లవ్ మౌళి”, చార్వి దత్తా, మిర్చి హేమంత్, భావన సాగి మరియు మిర్చి కిరణ్ ఇతర ప్రముఖ పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు మరియు సి స్పేస్, నైరా క్రియేషన్స్ మరియు శ్రీకరా స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. గోవింద్ వసంత పాటలు సమకూర్చగా, దర్శకుడు అవనీంద్ర స్వయంగా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.