ఎంతగానో ఎదురుచూసున్న కల్కి 2898 AD ఎట్టకేలకు విడుదలైంది. ప్రీమియర్ షో టాక్ అయితే అద్భుతంగా ఉంది. సరే ఇక సినిమా చూడదగినదేనా కాదా అని తెలుసుకుందాం.
సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే సిటీ ని రూల్ చేస్తుంటాడు. ఆ కంప్లెక్స్ లో ఒక టెస్ట్ సబ్జెక్ట్ గా సమ్ 80, (దీపికా పదుకొణె) ఉంటుంది. ఒక రోజు ఆమె ఒక కాంప్లెక్స్ నుండి తప్పించుకుంటుంది. అయితే తనని పట్టిస్తే 50000 మిలియన్ యూనిట్ల బహుమతిని ఇస్తామని ప్రకటిస్తారు. ఇక బౌంటీ హంటర్ భైరవ (ప్రభాస్) ఆమెను పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు కానీ అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) అతని నుండి ఆమెను రక్షిస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
పురాణాలు మరియు సైన్స్ ఫిక్షన్ కలిపి ఇలాంటి ఒక సినిమా తీయాలి అన్న ఆలోచనకి నాగ్ అశ్విన్ ని అభినందించాల్సిందే. సినిమా బాగానే మొదలవుతుంది కాని కొంత సేపటికి నత్త నడకగా నడిచే స్క్రీన్ ప్లేతో బోర్ అనిపిస్తుంది. అయితే, ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి కథ వేగం పుంజుకుంటుంది ఇక అప్పటి నుండి క్లైమాక్స్ వరకు విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది.
భైరవగా ప్రభాస్ బాగా చేసాడు మరియు చాలా గ్యాప్ తర్వాత మనం అతని ఫన్నీ యాంగిల్‌లో చూస్తాము. దీపికా పడుకొనే స్క్రీన్ టైమ్ తక్కువున్నప్పటికీ తన సత్తా చాటింది. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ సుప్రీం యాస్కిన్‌గా అద్భుతంగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ సత్తా చాటారు.
సాంకేతికంగా, కల్కి 2898 AD అగ్రస్థానంలో ఉంటుంది, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ ఇంకాస్త బాగుండాల్సింది. ఈ రకమైన విజువల్స్ సాధించినందుకు నిర్మాణ బృందాన్నీ అభినందించాల్సిందే.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఇలాంటి కథను అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అతను ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయం సాధించాడు.
మొత్తంమీద, కల్కి 2898 AD తప్పక చూడవలసిన చిత్రం. మంచి సౌండ్‌ప్రూఫ్ థియేటర్‌లో దీన్ని చూడండి.