పవన్ సిద్ధూ, సోనియా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేక్షకులకి చాల దగ్గరయ్యారు.
ఇక ఇప్పుడు శశి మధనం తెలుగు వెబ్ సిరీస్ ఈటీవీ విన్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్‌తో పవన్ సిద్ధూ, సోనియా సింగ్ ఇద్దరు ఓట్ డెబ్యూ చేస్తున్నారు. అయితే, ట్రైలర్ తో మంచి బజ్‌ను సృష్టించిన ఈ సిరీస్ ఈరోజు రిలీజ్ అయింది మరి సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
మధన్ (పవన్ సిద్ధు) మరియు శశి (సోనియా సింగ్) చాలా కాలంగాప్రేమించుకుంటారు. ఒక రోజు, శశి తల్లిదండ్రులు ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లడంతో శశి మదన్ క్కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. అయితే అప్పటికే మదన్ బెట్టింగ్స్ చేసి అప్పుల వారి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. ఇక ఇదే సమయం అని శశి ఇంటికి వెళ్తాడు. అయితే శశి తల్లిదండ్రులు హఠాత్తుగా ఇంటికి రావడంతో కథ అడ్డం తిరుగుతుంది.
శశి మధనం కి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే పవన్ సిద్ధూ మరియు సోనియా సింగ్ కెమిస్ట్రీ. దానికి తోడు వాళ్ళ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది.
6 ఎపిసోడ్‌లలో కొన్ని ఎపిసోడ్‌లు మనల్ని నవ్వించేలా చేస్తాయి ఇక మిగిలిన ఎపిసోడ్లు కామెడీ సరిగా పండక బోర్ కొద్దతుంది.
పవన్ సిద్ధూ, సోనియా సింగ్ నటన చాలా సహజంగా ఉంది. సాంకేతికంగా శశి మదనం బాగుంది, సింజిత్ యర్రమిల్లి సంగీతం బాగుంది మరియు రెహాన్ షేక్ ఛాయాగ్రహణం డీసెంట్ గానే ఉంది.
మొత్తంమీద, శశి మదనం కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు.