రెండు దశాబ్దాలకు పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి త్రిష. ఇప్పుడు OTT లోకి అడుగుపెట్టబోతుంది.
వెబ్ సిరీస్ బృందాతో ఆగస్టు 02, 2024న మన ముందుకొస్తుంది. సోనీ లివ్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఇది ప్రీమియర్‌ను కాబోతుంది.
ఇటీవలే బృంద సిరీస్ టీజర్ రిలీజ్ అయింది, మరియు టీజర్ చూస్తే మంచి థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. ఇందులో త్రిష పోలీస్ అధికారిగా నటిస్తుంది.
ఈ సిరీస్ లో త్రిషతో పాటు ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి తదితరులు నటించారు.
సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ సిరీస్‌కి కొల్లా ఆశిష్ నిర్మాత కాగా, శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. దినేష్ కె.బాబు సినిమాటోగ్రాఫర్.