ఎంతగానో ఎదురుచూస్తున్న భారతీయుడు 2 సీక్వెల్ ఎట్టకేలకు విడుదలైంది, అయితే, ఈ చిత్రం ప్రేక్షకులలో తగినంత బజ్‌ను సృష్టించడంలో విఫలమైంది. మరి సినిమా ఎలా ఉందో ఇంకా ఆలస్యం చేయఉండా చూసేద్దాం.
కథేంటంటే దేశం మల్లి అవినీతితో నిండి పోతుంది. యూట్యూబర్ అయిన అరవింద్ (సిద్ధార్థ్) ఇదంతా మార్చాలని నిర్ణయించుకుంటాడు, అయితే ఆ సామర్థ్యం తనకు లేదని అతను వెంటనే గ్రహించి, భారతీయుడిని అంటే సేనాపతిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
అవినీతి అనే యూనిక్ పాయింట్ ఉన్న భారతీయుడు లో ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు ౨ లో అదే పాయింట్ పాతబడిపోయింది. భారతీయుడు 2 లో కొత్తగా అంటూ ఎం లేదు. రొటీన్ సన్నివేశాలు మరియు నత్త నడకతో సాగె కథనం మనకు కనిపిస్తుంది.
భారతీయుడు 2లో ఏదైనా బాగుంది అంటే ప్రొడక్షన్ క్వాలిటీ మరియు కమల్ హాసన్. అనిరుధ్ అత్యద్భుతమైన సంగీతాన్ని అందించడంలో విఫలమయ్యాడు.
కమల్ హాసన్ నటన బాగుంది కానీ మేకప్ మాత్రం అక్కడకక్కడ తేడా కొట్టేసింది. రకుల్ ప్రీత్ కి ఎలాంటి స్కోప్ లేదు, సిద్ధార్థ్ తన సత్తా చాటాడు ఇక ఎస్‌జె సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ మరియు ఇతరులు తమ వంతు పాత్రలని బాగా చేసారు.
ఓవరాల్‌గా, భారతీయుడు 2 నిరుత్సాహపరిచింది అయితే కమల్ హాసన్ మరియు శంకర్ కోసం దీనిని ఒక్కసారి చూడొచ్చు.