ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది గోట్ లైఫ్ ఎట్టకేలకు OTT లోకి రానుంది. థియేటర్లో విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత, ఈ చిత్రం OTTలో అరంగేట్రం చేస్తోంది.
పృథ్వీరాజ్ సుమారన్ 16 సంవత్సరాల పాటు ఈ చిత్రాన్ని రూపొందించడం మరియు అతని నటన కి గాను మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి ఆదరణ లభించింది.
ది గోట్ లైఫ్ 19 జూలై 2024న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీలో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్ లూయిస్, కెఆర్ గోకు, శోభా మోహన్, తాలిబ్ అల్ బలూషి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, సునీల్ కెఎస్ ఛాయాగ్రహణం చేసారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై నిర్మించారు.