Shekhar Home OTT: తెలుగులో రిలీజ్ కాబోతున్న శేఖర్ హోమ్ వెబ్ సిరీస్

Shekhar Home OTT

నటుడు కే కే మీనన్ కొంత విరామం తర్వాత ‘శేఖర్ హోమ్’ అనే కొత్త సిరీస్‌తో OTTలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. జియో సినిమా ఈ సిరీస్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

డిటెక్టివ్ థ్రిల్లర్‌గా అనిపించే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ మధ్యనే జియో సినిమా విడుదల చేసింది. ఫస్ట్ లుక్ చూసాక షెర్లాక్ హోమ్స్‌కు ఈ సిరీస్ ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది.

ఈ సిరీస్ లో కే కే మీనన్, రణవీర్ షోరే, రసిక దుగల్, కీర్తి కుల్హారి మరియు ఇతరులు నటించారు. ఈ సిరీస్‌కి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

బెంగాల్‌లోని లోన్‌పూర్ అనే పట్టణంలో 1990 ల్లో జరిగే కథ. శేఖర్ మరియు అతని స్నేహితుడు జయవ్రత్ సాహ్ని బెంగాల్ చుట్టూ ఉన్న మర్డర్ మిస్టరీలను ఎలా ఛేదించారు అనేది ఈ సిరీస్ మూలకథ.

శేఖర్ హోమ్ 14 ఆగస్టు 2024న జియో సినిమాలో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో అందుబాటులో ఉంటుంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు