మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, “టర్బో” సినిమాని సీనియర్ దర్శకుడు వైశాఖ్‌తో కలిసి చేశారు, ఇది మే 23, 2024లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మలయాళంలో మంచి కల్లెక్షన్లని వసూలు చేసింది.
మమ్ముట్టి నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం టర్బో ఇప్పుడు ఆగస్టు 09, 2024న Sony Liv OTT ప్లాట్‌ఫామ్ లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.
మమ్ముట్టితో పాటు, ఈ చిత్రంలో రాజ్ బి. శెట్టి, అంజనా జయప్రకాష్, సునీల్, శబరీష్ వర్మ, కబీర్ దుహన్ సింగ్, నిరంజన అనూప్, బిందు పనికర్, దిలీష్ పోతన్ మరియు మరికొంత మంది నటించారు.
మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకి వైశాఖ్ దర్శకత్వం వహించాడు. క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చగా, విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్, షమీర్ మహమ్మద్ ఎడిటర్.