ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాల గురించి మనకు తెలియట్లేదు కూడా, కానీ OTT లో విడుదలైన తరవాతే వాటి గురించి తెలుస్తుంది.
అలాగే తెప్ప సముద్రం పేరుతో కొన్ని రోజుల క్రితం థియేటర్‌లో విడుదలైంది ఇక ఇప్పుడు ఆగస్ట్ 3, 2024న ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రం తెప్ప సముద్రం అనే చిన్న పట్టణం నేపథ్యంలో కథ సాగుతుంది అయితే ఆ ఊళ్లోని పాఠశాలలో బాలికలు తప్పిపోతుంటారు అయితే వారిని ఎవరు చంపుతున్నారు, వారిని ఎలా రక్షించారు అనేది మూలకథ.
తెప్ప సముద్రం సినిమా లో చైతన్య రావు, అర్జున్ అంబటి, కిషోరి ధాత్రక్ మరియు రవిశంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.
శ్రీ మణి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. పిఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడు, శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రాఫర్.