అందాల భామ త్రిష ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది.
తెలుగు, తమిళ భాషల్లో కొత్తవారు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్నప్పటికీ చాలా మంది దర్శకనిర్మాతలకు ఆమె మంచి ఛాయిస్‌గా మారింది.
ఇప్పుడు, ఆమె బృందా అనే తెలుగు వెబ్ సిరీస్‌తో తన OTT అరంగేట్రం చేసింది. ఈ సిరీస్ ప్రస్తూతం సోనీలివ్ లో స్ట్రీమ్ అవువుతుంది. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌లో ఒక్కొక్కటి 40 నిమిషాలు ఉంటాయి మరియు వాతావరణం మరియు ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లే ఎంగేజ్ చేస్తాయి.
సబ్ ఇన్‌స్పెక్టర్ బృందా (త్రిష) ఒక హత్య కేసులో, ఆమె ఉన్నతాధికారులు ఆత్మహత్య అని పేర్కొంటూ కేసును మూసివేస్తారు, అయితే ఇది ఆత్మహత్య కాదు, ఇది కోల్డ్ బ్లడెడ్ హత్య అని బృందా చెప్తుంది. ఇక ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది, హంతకుడు ఎవరు అనేది మిగతా కథ.
ఈ సిరీస్ సాధారణ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ల కాకుండా, ఇన్వెస్టిగేషన్ కొత్తగా ఉంటుంది. చాలా డిటైలింగ్ గా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్‌లలో స్క్రీన్ప్లే నెమ్మదిగా ఉన్నప్పటికీ, దర్యాప్తు మనల్ని సిరీస్ మొత్తమ్ చూసేలా చేస్తుంది.
బృందా పాత్రలో త్రిష చక్కటి నటనను కనబరిచింది. ఇక రవీందర్ విజయ్ సారథి క్యారెక్టర్‌లో తన సత్తా చాటాడు. ఇంద్రజిత్ సుకుమారన్ కూడా బాగా నటించాడు, మిగతా నటీనటులు కూడా బాగా చేసారు.
సాంకేతికంగా బృంద ఆకట్టుకుంటుంది. సిరీస్‌కి తగ్గట్టు ఛాయాగ్రహణం చాల బాగుంది. సంగీతం చాలా భిన్నంగా ఉంది. సూర్య మనోజ్ వంగల మొదటి సిరీస్ అయినా తన కథనంతో ఆకట్టుకున్నాడు. అతను సిరీస్‌లో కొన్ని సన్నివేశాలు చాల బాగా హ్యాండిల్ చేసాడు.
మొత్తంమీద, బృందా తప్పక చూడవలసిన సిరీస్. డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.