కొంత గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ యాక్షన్ కామెడీ డ్రామా బడ్డీతో వచ్చాడు. అతను సినిమాను దూకుడుగా ప్రమోట్ చేశాడు మరియు సింగిల్ స్క్రీన్ టిక్కెట్ ధరలు 99 , మల్టీప్లెక్స్‌లు 112 అని చెప్పడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) ఒక పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అయిన పల్లవి (గాయత్రీ భరద్వాజ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కిడ్నాప్‌కు గురైన తర్వాత పరిస్థితులు తారుమారవుతాయి. టెడ్డీ బేర్ సహాయంతో ఆదిత్య రామ్ పల్లవి ని ఎలా రక్షించాడనేది సినిమా కథ.
బడ్డీ సినిమా మూల కథ బాగుంది, కానీ కథ అంత ఉహించదగేలా ఉండండం వల్ల చూసే ఇంట్రెస్ట్ పోతుంది. అల్లు శిరీష్ నటన బాగుంది మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా రూపొందించబడ్డాయి. అది తప్ప మనల్ని సినిమా చూసేలా ఏది బాగా లేదు.
ఈ చిత్రం చాలా చోట్ల సస్పెన్స్‌ను మైంటైన్ చేయడంలో విఫలమైంది మరియు అలీ యొక్క కామెడీ ట్రాక్ కథకు పెద్ద అడ్డుగా మారింది.
అల్లు శిరీష్ మంచి నటనను కనబరిచాడు మరియు గాయత్రీ భరద్వాజ్ కూడా అక్కడక్కడా బాగానే నటించారు. అజ్మల్ అమీర్ నటన మామూలుగానే ఉంది. అలీ, ముఖేష్ రిషి మరియు ఇతరులు పర్వాలెదు.
టెక్నికల్‌గా బడ్డీ డీసెంట్‌గా ఉంది. హిప్‌హాప్ తమిజా పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే మరియు కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.
శాన్ ఆంటోన్ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చాడు కానీ దానిని తెరపై ఆకర్షణీయంగా ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. మొత్తంమీద బడ్డీ అనేది వన్ టైమ్ వాచ్.