కొన్ని సినిమాలు మంచి అంచనాలతో విడుదలవుతాయి కానీ విడుదలైన తర్వాత థియేటర్లలో అదే సందడిని కొనసాగించలేకపోతాయి. అలాంటి సినిమాలలో డార్లింగ్ ఒకటి, మంచి బజ్‌తో థియేటర్లలో విడుదలైంది, కానీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
ప్రీమియర్ షో నుండి అనుకున్నంత రెస్పాన్స్ లేకపోవడం తో, ఈ చిత్రం థియేటర్లలో ఒక వారం పాటు కూడా నడవలేదు. ఇక ఇప్పుడు ఆగస్టు 13, 2024న డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది.
ఈ చిత్రంలో ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషించారు, అనన్య నాగళ్ల, మోయిన్, బ్రహ్మానందం, శివారెడ్డి, మురళీధర్ గౌడ్ మిగతా పాత్రలు పోషించారు.
కొత్త దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి & శ్రీమతి చైతన్య నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, నరేష్ రామదురై సినిమాటోగ్రాఫర్ గా చేసారు.