Birthmark Telugu OTT: తెలుగులోకి రాబోతున్న లేటెస్ట్ తమిళ చిత్రం బర్త్ మార్క్

Birthmark Telugu OTT

తమిళ చిత్రం బర్త్‌మార్క్ 23 ఫిబ్రవరి 2024న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంలో విఫలమైంది. నెల రోజుల్లోనే సినిమా ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఇప్పుడు, బర్త్‌మార్క్ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో షబీర్ కల్లరక్కల్, మీర్నా ప్రధాన పాత్రలు పోషించారు.

బర్త్‌మార్క్ తెలుగు లో 08 ఆగస్టు 2024 నుండి ఆహా వీడియోలో ప్రీమియర్ అవుతుంది. షబీర్ కల్లరక్కల్ మరియు మీర్నాతో పాటు, ఈ చిత్రంలో PR వరలక్ష్మి, ఇంద్రజిత్, పోర్కోడి, దీప్తి ఇతరులు నటించారు.

విక్రమ్ శ్రీధరన్ & శ్రీరామ్ శివరామన్ కథను రాయగా, విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వం వహించారు. సీతా రామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఉదయ్ తంగవేల్ ఛాయాగ్రహణం చేయగా, సేపియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విక్రమ్ శ్రీధరన్ & శ్రీరామ్ శివరామన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు