జూలై 12, 2024న థియేటర్లలో చాలా హైప్ తో రిలీజ్ ఐన భారతీయుడు 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక ఈ చిత్రం మే 09,1996న విడుదలైన భారతీయుడికి సీక్వెల్ అనే విషయం తెలిసిందే. 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తున్నందున అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
థియేటర్ లో విడుదలై నెలలోపే భారతీయుడు 2 OTT లోకి వచ్చేస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 09, 2024 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళంలో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బాబీ సింహా, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్, గురు సోమసుందరం, వి జయప్రకాష్, ఆడుకలం నరేన్, ఢిల్లీ గణేష్, తంబి రామయ్య, ఇషారి గణేష్, తదితరులు నటించారు.
ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, రవి వర్మన్ ఛాయాగ్రహణం చేశారు.