మెగా కూతురు నిహారిక కొణిదెల కమిటి కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా తొలి చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేసింది. కొంత హైప్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందొ ఇప్పుడు ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కోనసీమ గ్రామం పురుషోత్తంపల్లె గ్రామంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక జాతర వైభవంగా జరుగుతుంది. సత్తయ్య (కంచెరపాలెం కిషోర్) ఈ జాతర లో ఒక కీలకమైన వ్యక్తి, అతని చేతుల మీదుగా జాతర జరిగేది. కొన్ని పరిస్థితుల వల్ల సత్తయ్య ఊరు విడిచి వెళ్లిపోతాడు. తమ గ్రామానికి ముఖ్యమైన ఆచారాన్ని కొనసాగించడానికి సత్తయ్యను తిరిగి తీసుకువచ్చే బాధ్యతను కొంత మంది యువకులు తీసుకుంటారు. మరి ఆ యువకులు ఎం చేసారు అనేది తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే.
యధు వంశీ కథ చాలా బాగా రాసుకున్నారు. మన చిన్న వయస్సులో గ్రామాలలో పుట్టి పెరిగిన జీవితాలను గుర్తుచేసుకునేలా ఉంటాయి కొన్ని సీన్లు. ఇంకా ఈ చిత్రం చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో కనీసం కొన్ని పాత్రలు తప్పకుండా చూసి ఉంటారు.
స్క్రీన్ ప్లే కూడా పర్ఫెక్ట్ గా ఉంది. దాదాపు 30 సంవత్సరాల పాటు సాగే ఈ కథలో అన్ని దశలు చక్కగా చూపించారు. ఫ్రెండ్‌షిప్ కథకు పెద్ద బలం అలాగే వంశీ తన కథాంశాన్ని, దాని చుట్టూ సన్నివేశాలను అల్లిన విధానం చాలా బాగుంది.
ఫస్ట్ హాఫ్ మంచి కథ తో అక్కడక్కడా కామెడీ తో ఎంగేజ్ చేస్తూ ఇంటర్వెల్ సీన్‌తో ఒక ఇంటెన్స్ సినిమా ఫీలింగ్ ఇస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ లో గ్రామ ఎన్నికలతో కొంచం బోర్ కొట్టిస్తుంది. కానీ క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు మనల్ని ఎమోషనల్ చేస్తాయి.
సందీప్ సరోజ్, త్రినాధ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల మరియు ప్రసాద్ బెహరా మంచి నటన కనబర్చి వారి పాత్రలకు ప్రాణం పోశారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన కిషోర్ కుమార్ పొలిమెర, సాయి కుమార్ మరియు ఇతరుల పాత్రలు సినిమాకి బాగా దోహదపడ్డాయి.
మొత్తం మీద, కమిటీ కుర్రోళ్లు ఒక మంచి యూత్ కామెడీ ఎంటర్టైనర్. నవ్వులు, ప్రేమలు మరియు ఎమోషనల్ కూడా చేస్తుంది. ఈ వీకెండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ తో వెళ్లి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకోండి.