సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి పెద్ద పెద్ద నటులు ఉన్న ఈ సినిమా ఒకే ప్రేమకథ కాదు; ఇది రెండు తరాల మధ్య సాగే ప్రేమకథ. ఇంకా పెళ్లి కోసం తల్లిదండ్రులు మరియు వారి పిల్లల మధ్య గొడవలతో ఉంటుంది. ఘుడ్‌చడీ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు ఇంకా ఫామిలీ డ్రామా ని ఇష్టపడే వారికి నచ్చేలా ఉంటుంది. గోల్ఫ్ కోర్ట్లు, గార్డెన్‌లు, అందంగా ఉండే ఇళ్లు ఇంకా మంచి లొకేషన్‌ల ని షూటింగ్ కి తీసుకున్నారు. ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూ లో చూద్దాం.
ఈ చిత్రం చిరాగ్ (పార్థ్ సమతాన్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని నానమ్మ కళ్యాణి (అరుణ ఇరానీ) అతనికి తొందరగా పెళ్లి చేయాలి అనుకుంటుంది. కానీ చిరాగ్ తన స్నేహితుడి పెళ్లిలో దేవిక (ఖుషాలి కుమార్) అనే అమ్మాయిని కలుస్తాడు, మొదటి చూపులోనే ప్రేమించి, డేటింగ్ కూడా చేస్తుంటాడు. చిరాగ్ తండ్రి వీర్ (సంజయ్ దత్) అనుకోకుండా తన మాజీ ప్రియురాలు మేనక (రవీనా టాండన్)ని కలుస్తాడు. ఇప్పుడు ఒకవైపు పిల్లలు రొమాన్స్ చేస్తుంటే, మరోవైపు తల్లిదండ్రులు రొమాన్స్ చేస్తున్నారు. చిరాగ్ మరియు దేవిక కుటుంబ సభ్యులతో పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటారు. మరి తరవాత ఏమైంది అనేది మిగతా కథ.
సంజయ్ దత్, రవీనా టాండన్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. తెరపై వారు మళ్ళి కలిసి సినిమా చేయడం ప్రేక్షకులకి 90 ల నాటి రోజులని గుర్తుచేస్తాయి. ఖుషాలి కుమార్ మరియు పార్థ్ సమ్తాన్ సినిమాకు యూత్ ఫుల్ వైబ్ ని చూపించారు. ఇంకా నానమ్మ గా చేసిన అరుణా ఇరానీ కూడా బాగా చేసారు.
ఘుడ్‌చడీ ఫస్ట్ హాఫ్ కొంచం రిఫ్రెష్ గా ఉంటుంది కానీ కొంచం కామెడీ ని కూడా పెంచితే ఇంకా బాగుండేది. ఇంటర్వెల్ బ్లాక్ లో ఉన్న ట్విస్ట్ కాస్తా నవ్విస్తుంది, సెకండాఫ్,క్లైమాక్స్ లో సినిమా కొంచం ఎమోషనల్ గా ఉంటుంది.
ఓవరాల్‌గా ఘుడచాడి ఒక అవేరేజ్ సినిమా. కానీ, మీరు సంజయ్ దత్, రవీనా టాండన్, ఖుషాలి కుమార్ లేదా పార్థ్ సమతాన్ అభిమాని అయితే, ఒకసారి చూడొచ్చు!