దివ్యేందు శర్మ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మిర్జాపూర్ సిరీస్ అందులో తన నటన తో చాలా మంచి గుర్తింపు పొందారు. ఇంకా ఇప్పుడు ఒక కొత్త సిరీస్ లైఫ్ హిల్ గయీ అనే కామెడీ-డ్రామా తో మన ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ప్రేమ్ మిస్త్రీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కామెడీ ఇంకా ఎమోషన్స్ తో ఉంటుంది. ఇందులో కుషా కపిల, ముక్తి మోహన్, కబీర్ బేడి, వంశిక తపారియా, వినయ్ పాథక్ వంటి నటులు కూడా ఉన్నారు.
ఉత్తరాఖండ్ గ్రామంలో ఒక పాడుబడిన రిసార్ట్ ఉంటుంది, ఒక తాత (కబీర్ బేడి) గొడవ పడుతున్న తన పిల్లలైనా దేవ్ (దివ్యేందు) మరియు కల్కి (కుశ కపిల)లకు ఆ రిసార్ట్ ని చూపిస్తారు. ఎవరైతే ఆ రిసార్ట్ ని డెవలప్ చేస్తారో వారికే ఒక సర్పైజ్ ఉంటుందని చెప్తారు ఇంకా వాళ్లకి ఆ రిసార్ట్ కూడా ఇచ్చేస్తా అని చెప్పడం తో వాళ్లిద్దరూ తమ తమ స్టైల్ లో దాన్ని చేంజ్ చేస్తుంటారు. మరి ఆ ఛాలెంజ్ లో ఎవరు గెలిచారో తెలుసుకోవాలి అంటే సిరీస్ చూడాల్సిందే.
మొదటి నుండి, పాత్రలు ఇంకా వారి పనులతో కనెక్ట్ అవ్వడం సవాలుగా ఉంటుంది. దర్శకుడు ప్రేమ్ మిస్త్రీ ఆరు ఎపిసోడ్‌లలో ఒక సాధారణ కథాంశాన్ని చూపించాడు, కానీ అది అనుకున్నంత గొప్పగా ఏమి ఉండలేదు.
ప్రతి ఎపిసోడ్ అరగంట కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏ ఒక్కటీ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఎపిసోడ్‌లు అన్ని కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్న కథను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి.
దివ్యేందు శర్మ, ‘మీర్జాపూర్’లో మున్నాభాయ్‌గా క్రూరమైన పాత్రతో గుర్తింపు పొందాడు కానీ ఈ సిరీస్ లో ఒక ఫ్రెండ్లీ ఇంకా తెలివైన వాడిలా నటించాడు. అయినప్పటికీ, తన పాత్ర అంతలా గుర్తుండేలా ఉండలేకపోయింది.
దేవ్ మరియు కల్కిల తండ్రిగా నటించిన వినయ్ పాఠక్‌తో సహా మిగిలిన ప్రతిభావంతులైన నటీనటులకు కూడా అంతగా నటించే స్కోప్ లేకపోయింది కథలో. ముక్తి మోహన్ ఒక విలేజి అమ్మాయిగా చాలా బాగా కనిపించారు.
ఓవరాల్ గా, ‘లైఫ్ హిల్ గయీ’ గొప్ప నటులను అలాగే అందమైన లొకేషన్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయింది. లొకేషన్స్ కోసం ఈ సిరీస్ ని ఒకసారి చూడొచ్చు.