ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద నటీనటులందరూ డైరెక్ట్ OTT ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అయ్యే సినిమాలలో, సిరీస్ లలో కూడా కనిపిస్తున్నారు. అలాగే మన కట్టప్ప సత్యరాజ్ కూడా “మై పర్ఫెక్ట్ హస్బెండ్” అనే సిరీస్‌తో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు.
ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలైంది అందులో ఆగస్టు 16, 2024న డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అవుతుందని అనౌన్స్ చేసారు.
“మై పర్ఫెక్ట్ హస్బెండ్”లో సత్యరాజ్, రేఖ, సీత, వర్ష బొల్లమ్మ, రక్షణ్, లివింగ్‌స్టన్, అజీద్ ఖలిక్, కృతికా మనోహర్, రాఘవి మరియు రేష్మా పసుపాల్టీ ఉన్నారు.
ఈ కొత్త కామెడీ డ్రామాని తామిరా దర్శకత్వం వహించగా, మహమ్మద్ రాసిత్ నిర్మించారు. విద్యాసాగర్ సంగీతం అందించారు. అలాగే ఈ సిరీస్ తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది.