మార్చి 2024లో థియేటర్లలో విడుదలైన మలయాళ థ్రిల్లర్ తలవన్ ప్రేక్షకులనుండి, విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను అందుకుంది.
చాలా గ్యాప్ తర్వాత, తలవన్ ఇప్పుడు మలయాళ ఆడియోతో పాటు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ మరియు బెంగాలీ భాషల్లో సోనీ లివ్ OTT ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 10, 2024న రిలీజ్ అవుతుంది.
ఈ థ్రిల్లర్‌లో బిజు మీనన్, ఆసిఫ్ అలీ, మియా జార్జ్, అనుశ్రీ, దిలీష్ పోతన్, శంకర్ రామకృష్ణన్, రంజిత్, కొట్టాయం నజీర్, జాఫర్ ఇడుక్కి, జోజి ముండకాయం, సుజిత్ శంకర్ మరియు ఇతరులు నటించారు.
జిస్ జాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణ్ నారాయణ్ & సిజో సెబాస్టియన్ నిర్మించారు. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా, శరణ్ వేలాయుధన్ సినిమాటోగ్రాఫర్.