యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD థియేటర్ లో భారీ కలెక్షన్లు వసూలుచేసి ఇప్పుడు OTT లోకి రాబోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
కల్కి 2898 AD ప్రైమ్ వీడియోలో ఆగస్టు 22, 2024 న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో అందుబాటులో ఉంటుంది. కానీ హిందీ వెర్షన్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, పశుపతి, శోభన తదితరులు నటించారు.
నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించారు, డిజోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ చేశారు, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు మరియు సి. అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 కోట్లతో రికార్డ్ కలెక్షన్స్ సృష్టించింది. మనందరికీ తెలిసినట్లుగా, మేకర్స్ సినిమాను అనుకున్న దానికన్నా తక్కువగానే ప్రమోట్ చేసారు, దానివల్ల కొంచం కలెక్షన్స్ మీద ప్రభావం పడింది లేకపోతే 1100 కోట్ల కంటే ఇంకా ఎక్కువే వసులు చేసేది.