Home సినిమా వార్తలు Raayan Movie OTT: తమిళ్ యాక్టర్ ధనుష్ 50వ చిత్రం “రాయన్” OTT లోకి రాబోతుంది

Raayan Movie OTT: తమిళ్ యాక్టర్ ధనుష్ 50వ చిత్రం “రాయన్” OTT లోకి రాబోతుంది

0
Raayan Movie OTT: తమిళ్ యాక్టర్ ధనుష్ 50వ చిత్రం “రాయన్” OTT లోకి రాబోతుంది

Raayan Movie OTT

ధనుష్ 50వ చిత్రం రాయన్ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం OTT లో రిలీజ్ చేస్తున్నారు.

రాయన్ సినిమా ప్రైమ్ వీడియోలో 23 ఆగస్టు 2024న రిలీజ్ అవుతుంది. ఈ యాక్షన్ డ్రామా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

రాయన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. పా పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది.

ఈ చిత్రంలో ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, నిత్యా మీనన్, అపర్ణ బాలమురళి, అమలా పాల్, ఎస్.జె.సూర్య, దుషార విజయన్, సెల్వ రాఘవన్, వరలక్ష్మి శరత్‌కుమార్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here