నటుడు వరుణ్ సందేశ్ ఒకప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందించి ఇప్పుడు మంచి విజయాన్ని అందుకోవడం కోసం కష్టపడుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా విరాజి అనే సినిమా తెరకెక్కింది.
విరాజి చిత్రం థియేటర్లలో విడుదలకు ముందే కొంత బజ్ ని సృష్టించింది, కానీ వరుణ్ సందేశ్‌కు మరో ప్లాప్ ఏ లభించింది. ఈ చిత్రం ఇప్పుడు ఆగస్ట్ 22, 2024న ఆహా వీడియోలో రిలీజ్ చేస్తున్నారు.
వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పులప, ప్రసాద్ బెహరా తదితరులు ఈ చిత్రం లో నటించారు.
ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాత. ఎబినేజర్ పాల్ (ఎబ్బి) సంగీతం సమకూర్చగా, జి.వి. అజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్.