క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ హీరోగా నటించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రమణ్యం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన తర్వాత మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం తగినంత బజ్‌ని సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
ఉద్యోగం లేని సుబ్రమణ్యం (రావు రమేష్) చుట్టూ కథ తిరుగుతుంది. అతను ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నాడు, అయితే చాలా ప్రయత్నాలు చేసిన కూడా ప్రభుత్వ ఉద్యోగం మాత్రం రాదు. దీంతో సుబ్రమణ్యం ఏ ఉద్యోగం లేక తన భార్య కళా రాణి (ఇంద్రజ) ఆదాయంపై ఆధారపడి బీబ్రతుకుతుంటాడు. ఒకరోజు అతని ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
మారుతీ నగర్ సుబ్రమణ్యం లోని కథ మనందిరికి కనెక్ట్ అయ్యే కథ. ఇక ఆ కథకి హాస్యం జోడించి బాగానే ఎంగేజ్ చేసారు.
ఆసక్తికరమైన కథాంశంతో. మంచి కామెడీతో మొదటి సగం ఎక్కడ బోర్ కొట్టకుండా అయిపోతుంది. ఇక సెకండాఫ్ లో ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే లేకపోవడంతో తేడా కొట్టేసింది. అసలు కథని పక్కనే పెట్టి, అదే పనిగా కామెడీ పండించాలని ఏదేదో చేసారు, మరియు అల్లు అర్జున్ రెఫరెన్సులు ఎక్కువైపోయాయి.
రావు రమేష్ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్, అతని కామెడీ టైమింగ్ చాల బాగుంది. అంకిత్ కొయ్య తన పాత్రలో బాగా నటించాడు. ఇక రావు రమేష్ మరియు అంకిత్ కొయ్య మధ్య సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఇంద్రజ, అజయ్, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్ మరియు మిగిలిన నటీనటులు పర్వాలేదు.
దర్శకుడు లక్ష్మణ్ కార్య మంచి కథాంశంతో వచ్చాడు మరియు అతను అంతే ఆసక్తిగా సినిమాను తెర పై ఆవిష్కరించాడు. కానీ సెకండాఫ్‌లో తడబడ్డాడు.
ఓవరాల్‌గా, మారుతీ నగర్ సుబ్రమణ్యం సరదా సన్నివేశాలతో కూడిన డీసెంట్ సినిమా. కామెడీ కోసం ఒక్కదారి చూడొచ్చు.