అల్లు శిరీష్ నటించిన బడ్డీ చిత్రం ఆగష్టు మొదటి వారం లో థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఈ చిత్రం OTTలో రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.
ఆగస్టు 30, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో బడ్డీ ప్రీమియర్ అవుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో అల్లు శిరీష్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం వహించగా, హిప్ హాప్ తమిజా సంగీతం సమకూర్చారు మరియు ఈ చిత్రాన్ని కె.ఇ. జ్ఞానవేల్రాజా & ఆధాన జ్ఞానవేల్రాజా నిర్మించారు.
ఈ బడ్డీ చిత్రం ఆర్య తమిళ్ లో చేసిన టెడ్డీ చిత్రానికి రీమేక్. అయితే, బడ్డీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది ఇంకా ఈ చిత్రం OTTలో ఎలా మెప్పిస్తుందో చూద్దాం.