తెలుగు, తమిళం, హిందీ నుంచి చాలా వెబ్ సిరీస్‌లు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ మలయాళం నుండి వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగా వస్తుంటాయి.
గత కొన్నేళ్లుగా మలయాళం నుంచి కేవలం నాలుగు వెబ్ సిరీస్‌లు మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పుడు మలయాళం నుండి ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ వస్తుంది.
‘1000 బేబీస్’ పేరుతో కొత్త వెబ్ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేసారు అయితే అది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ 1000 బేబీస్ మలయాళం నుండి వస్తున్న ఐదవ వెబ్ సిరీస్. 1000 బేబీస్ OTT హక్కులను హాట్‌స్టార్ సొంతం చేసుకుంది అలాగే ఈ సిరీస్ OTT విడుదల అక్టోబర్ 18, 2024 కి రిలీజ్ అవుతుంది.
ఈసారి ప్రత్యేకమైన కాన్సెప్ట్ అలాగే పెద్ద తారాగణంతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రెహమాన్, నీనా గుప్తా, సంజు శివరామ్, అశ్విన్ కుమార్, ఆదిల్ ఇబ్రహీం మరియు షాజు శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇర్షాద్ అలీ, జాయ్ మాథ్యూ, వీకేపీ, మను ఎమ్ లాల్, షాలు రహీమ్, సిరాజుద్దీన్ నాజర్, డైన్ డేవిస్, రాధికా రాధాకృష్ణన్, వివియా శాంత్, నాజ్లిన్, దిలీప్ మీనన్, ధనేష్ ఆనంద్, శ్రీకాంత్ మురళి, శ్రీకాంత్ బాలచంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సిరీస్ ను నజీమ్ కోయా, ఆరోజ్ ఇర్ఫాన్, నజీమ్ కోయా దర్శకత్వం వహించారు. ఫైజ్ సిద్ధిక్ సంగీతం సమకూర్చగా, శంకర్ శర్మ ఛాయాగ్రహణం అందించారు మరియు సిరీస్‌ను షాజీ నడేసన్, ఆర్య నిర్మించారు.