Bench Life Series OTT: నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మరో కొత్త సిరీస్ “బెంచ్ లైఫ్” OTT లోకి రాబోతుంది

Bench Life Series OTT

OTT ప్లాట్‌ఫామ్ రావడంతో, రాబోయే సినిమాలు ఇంక సిరీస్‌ల గురించి ఏవైనా అప్‌డేట్‌లను తెలుసుకోవడం చాలా కష్టమైంది. కొన్ని సిరీస్‌లు చాలా కాలంగా నిర్మాణంలో ఉన్నాయి మరియు వాటి విడుదల తేదీలను అకస్మాత్తుగా ప్రకటిస్తున్నాయి.

“బెంచ్ లైఫ్” పేరుతో కొత్త సిరీస్ ఇప్పుడు ఎలాంటి అప్‌డేట్‌లు లేకుండా సెప్టెంబర్ 12, 2024న సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

“బెంచ్ లైఫ్”లో డా. రాజేంద్ర ప్రసాద్, వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, వెంకటేష్ కాకుమాను మరియు తనికెళ్ల భరణి వంటి ఆసక్తికరమైన తారాగణం ఉంది.

మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. పికె దండి సంగీతం సమకూర్చగా, దనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు