నేచురల్ స్టార్ నాని కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తాడని మంచి పేరుంది. అతను దసరా మరియు హాయ్ నాన్నతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు, వివేక్ ఆత్రేయతో రెండవసారి జతకట్టారు, వీళ్లిద్దరు ఇంతకుముందు “అంటే సుందరానికి” సినిమా తో మన ముందుకు వచ్చారు.
ఇక ఈ “సరిపోదా శనివారం” పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య భాగం కావడం, శనివారం ఫైట్ కాన్సెప్ట్ హైప్‌కి కారణం. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అన్నది తెలుసుకుందాం.
ఈ సినిమా లో కథ ఏంటంటే సూర్య (నాని) ఒక మధ్యతరగతి కుర్రాడు. అతను సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు, కానీ అతనికి చిన్నతనం నుండి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతో చిన్నప్పటినుండి ఎక్కువగా గొడవలు పడుతుంటాడు. ఇక సూర్య వాళ్ళ అమ్మ తన కోపాన్ని అదుపులో ఉంచడానికి ఒక మాట చెప్తుంది. అది ఏంటంటే వారం మొత్తం కోపాన్ని దాచుకుని ఒక్క శనివారం నాడు మాత్రమే చూపించు అని. అయితే, సూర్యతో సోకులపాలెం ప్రజలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మరియు తన కోపం వల్ల సూర్య మరియు దయా(ఎస్‌జె సూర్య)కి గొడవ ఏంటి అనేది సినిమాలో చూడాలి.
ఈ చిత్రం లో శనివారం మాత్రమే కోపం చూపించే పాయింట్ బావుంది కానీ సినిమా ట్రీట్‌మెంట్ అంత రెగ్యులర్ గా మనం చూసే కమర్షియల్ సినిమాల్లానే ఉంది.
అయితే ట్రీట్‌మెంట్ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లో సూర్య మరియు దయా యొక్క సన్నివేశాలు బావున్నాయి, వారి పాత్రలు చాలా బాగా రాసారు. లవ్ ట్రాక్ మూలకథకు ఎటువంటి సంబంధం లేదు, సూర్య మరియు దయాల పాత్రలు తప్ప, ఫస్ట్ హాఫ్‌లో మనల్ని ఏవీ ఎంగేజ్ చేయవు.
కానీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సెకండ్ హాఫ్ చూడాలనే ఇంటరెస్ట్ ని కలిగిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో కథనం చాలా వరకు ఊహించేలా ఉంటుంది. కొన్ని యాక్షన్ బ్లాక్‌లు తప్ప సెకండాఫ్‌లో కొత్తదనం ఏమి లేదు. సెకండాఫ్ లో కొన్ని సోకులపాలెం సన్నివేశాల వల్ల సినిమా చాలా సాగదీసినట్లు గా అనిపిస్తుంది.
సూర్యగా నాని ఎప్పట్లానే చాలా బాగా చేసాడు, మరియు దయాగా ఎస్‌జె సూర్య ఈసారి మల్లి తన నటనతో సత్తా చాటాడు. చారు పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్ చాలా అందంగా కనిపించినా నటనకు స్కోప్ లేదు. సాయి కుమార్ తదితరులు తమ వంతు పాత్రను చక్కగా చేశారు.
నాని, ఎస్‌జె సూర్య తర్వాత జేక్స్ బిజోయ్ మరో హీరో అయ్యాడు ఎందుకంటే తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశాడు.
మొత్తంమీద, సరిపోద శనివారం పాయింట్ బావున్నా ఒక్క సారి చూసే రెగ్యులర్ కమర్షియల్ చిత్రం.