మలయాళ చిత్రం “అడియోస్ అమిగో” థియేటర్ రిలీజ్ చాలాసార్లు వాయిదా పడింది. వయనాడ్‌లో భారీ వరదల కారణంగా మరోసారి వాయిదా వేసింది.
ఇది ఎట్టకేలకు ఆగస్ట్ 09 , 2024లో థియేటర్లలో విడుదలైంది అలాగే మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 06, 2024న రిలీజ్ చేస్తున్నారు.
“అడియోస్ అమిగో” లో ఆసిఫ్ అలీ, సూరజ్ వెంజరమూడు, అనఘ, సినీ టామ్ చాకో, వినీత్ తటిల్ డేవిడ్, అల్తాఫ్ సలీం మరియు నందు నటించారు.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మరియు గోపీ సుందర్ సంగీతం అందించారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రాఫర్. నహాస్ నాజర్ దర్శకుడు.