దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా కూడా మారి గతంలో మంచి కంటెంట్‌తో కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు తీశాడు. ఆయన నిర్మాతగా ఇటీవల వచ్చిన చిత్రం “సింబా”. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయినప్పటికీ, వివిధ కారణాల వల్ల, ఈ చిత్రాన్ని ఆగస్టు 09, 2024 న థియేటర్లలో విడుదల చేశారు.
ఇంకా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు అయితే ఇప్పుడు సెప్టెంబర్ 06, 2024న ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నారు.
సింబాలో జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, గౌతమి, వసిష్ట సింహ, శ్రీనాథ్ మాగంటి, దివి వడ్త్యా, అనీష్ కురువిల్లా మరియు కభీర్ సింగ్ దుహన్ నటించారు.
మురళీ మనోహర్ ఈ చిత్రానికి దర్శకుడు. సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించారు. కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చగా, కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేశారు.