నటుడు వరుణ్ సందేశ్ గత కొన్నేళ్లుగా ఒక మంచి హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు కానీ అన్ని ప్లాప్ లే అవుతున్నాయి. అయితే కొంత గ్యాప్ తరువాత, “నింద” అనే సినిమాతో ప్రేక్షకులలో ఒక మంచి బజ్ సృష్టించాడు.
సినిమాలో మంచి కథాంశం ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇంకా ఈ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 06, 2024న ETV Win ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది.
వరుణ్ సందేశ్, తనికెళ్ల భరణి, అన్నీ, భద్రమ్, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్ధార్థ్ కృష్ణ, రాజ్‌కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ ఈ చిత్రంలో నటించారు.
రాజేష్ జగన్నాథం ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించారు . సంతు ఓంకార్ సంగీతం సమకూర్చగా, రమీజ్ నవీత్ కెమెరా సినిమాటోగ్రఫీ చేశారు.