థియేటర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కమిటీ కుర్రోళ్లు’ OTT లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.
కమిటీ కుర్రోళ్లు డిజిటల్ హక్కులను ETV Win కొనుగోలు చేసింది ఇంకా ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2024న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా మన చిన్ననాటికి తీసుకెళ్తుంది, ఇది ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి అనుభవాలను గుర్తుచేస్తుంది. ఈ సినిమాలో దాదాపు అందరు కొత్తవాళ్లే ఉన్నారు.
ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్యా, తేజస్వీ రావు, టీన శ్రావ్య, విశిక, షణ్ముఖి, షణ్ముఖి నాగుమంత్ నటించారు. సాయికుమార్, గోపరాజు రమణ.
యధు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, అనుదీప్ దేవ్ సంగీతం అందించారు, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ చేసారు, నిహారిక కొణిదెల నిర్మించారు.