మాన్వత్ మర్డర్స్ అనే మరాఠీ వెబ్ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. 1970లో జరిగిన మాన్వత్ హత్యల ఆధారంగా ఈ సిరీస్ తీశారు.
మాన్వత్ మర్డర్స్ అక్టోబర్ 04, 2024న సోనిలివ్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ మరాఠీ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
అశుతోష్ గోవారికర్, సాయి తమంకర్, మకరంద్ అనస్పురే, సోనాలి కులకర్ణి, కిషోర్ కదమ్, మయూర్ ఖండ్గే మరియు ఇతరులు ఈ ధారావాహికలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ కి ఆశిష్ అవినాష్ బెండే దర్శకత్వం వహించగా, సత్యజీత్ శోభా శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించారు. సాకేత్ కనేత్కర్, మహేష్ కొఠారే సంగీతం అందించగా, ఆదినాథ్ కొఠారే నిర్మించారు.