తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్‌లలో ఒకటైన “గోలీ సోడా రైజింగ్” OTT రిలీజ్ డేట్ ని ట్రైలర్ తో పాటుగా రిలీజ్ చేశారు.
ఇంకా ఈ సిరీస్ ట్రైలర్‌లో గోలీసోడా సినిమా పార్ట్ 1 నుండి ప్రేక్షకులకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయి. అందరు ఎదురుచూస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 13, 2024న డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఈ సిరీస్‌లోని ప్రధాన తారాగణంలో చేరన్, షామ్, రమ్య నంబేసన్, మధుసూధన్ రావు, పుగజ్, జాన్ విజయ్, అభిరామి, అమ్ము అభిరామి, అవంతిక మిశ్రా, ఇమ్మాన్ అన్నాచి, విజయ్ మురుగన్, ఉదయ, పాండి మరియు శ్వేత ఉన్నారు.
ఈ సిరీస్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అలాగే గోలీసోడా సినిమా మొదటి మరియు రెండవ భాగాలకు దర్శకత్వం వహించిన SD విజయ్ మిల్టన్ దీనికి దర్శకత్వం వహించారు.