యూట్యూబర్ భువన్ బామ్ తన సరదా కంటెంట్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు అలాగే యూట్యూబ్‌లో కొన్ని ఇండిపెండెంట్ చిత్రాలలో నటించారు. “తాజా ఖబర్” అనే సిరీస్ ని తానే స్వయంగా నిర్మించి ప్రధాన పాత్ర పోషించాడు.
మొదటి సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ పొందింది ఇంకా ఇప్పుడు ఈ సిరీస్ యొక్క రెండవ సీజన్ సెప్టెంబర్ 27, 2024న డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సీజన్ 2 యొక్క ట్రైలర్ కూడా రీసెంట్ గానే రిలీజ్ చేసారు.
భువన్ బామ్‌తో పాటు, ఈ సిరీస్‌లో శ్రియా పిల్‌గావ్‌కర్, మహేష్ మంజ్రేకర్, జావేద్ జాఫ్రీ, దేవెన్ భోజానీ, శిల్పా శుక్లా, ప్రథమేష్ పరబ్ మరియు నిత్యా మాథుర్ కూడా నటించారు.
తాజా ఖబర్ ఈ సీజన్ 2కి హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు. బిబి కి వైన్స్ బ్యానర్‌పై రోహిత్ రాజ్, భువన్ బామ్ నిర్మించారు.