చాలా అంచనాల తో, అలాగే వివాదాస్పద ఇంటర్వ్యూల తో, రిలీజ్ అయినా “Mr. బచ్చన్” థియేటర్లలో ప్లాప్ అయింది. అయితే తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోల నుండి నెగటివ్ టాక్ తో ఘోరంగా విఫలమైంది.
థియేటర్లలో ప్లాప్ అయినా తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది, సెప్టెంబర్ 12, 2024న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లో కూడా రిలీజ్ చేస్తున్నారు.
మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సత్య, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణ, సిద్ధు జొన్నలగడ్డ ఉన్నారు.
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చగా, అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్.