“డబుల్ ఇస్మార్ట్”, “మిస్టర్ బచ్చన్” వంటి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకే రోజు విడుదలైనప్పటికీ, “ఆయ్” సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి థియేటర్లో ప్రేక్షకులను అలరించింది.
థియేటర్లలో విజయవంతమైన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 12, 2024న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కి సిద్ధం గా ఉంది. ఇంకా తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి, వినోద్ కుమార్, సురభి ప్రభావతి తదితరులు నటించారు.
అంజి కె మణిపుత్ర ఈ చిత్రానికి దర్శకుడు. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ & విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ మిరియాల సంగీతం అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్.