జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన బ్లాక్ బస్టర్ “మహానటి” తర్వాత మళ్ళి అంత గొప్ప విజయం రాలేదు. తన కెరీర్ చాలా ప్లాప్ లతో వెళ్తుంది అలాగే వరుణ్ ధావన్‌తో కలిసి ఒక హిందీ సినిమాలో కూడా నటిస్తుంది, కానీ ఇంకా విడుదల కాలేదు.
అయితే “రఘు తాత” సినిమా మొదట తెలుగు-తమిళ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేసారు, కానీ తమిళంలో మాత్రమే విడుదలైంది. ఇప్పుడు జీ5 OTT ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 13, 2024న తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో రిలీజ్ చేస్తున్నారు.
కీర్తి సురేష్, M.S. భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, జయకుమార్, రాజీవ్ రవీంద్రనాథన్, ఆనందసామి, రాజేష్ బాలచంద్రన్, ఇస్మత్ బాను, అధిర పాండిలక్ష్మి, జానకి, చు ఖోయ్ షెంగ్, కె.ఎస్. మిప్పు, ముఖేష్, మనోజ్ కుమార్ కలైవానన్ ఈ చిత్రం లో నటించారు.
సుమన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీన్ రోల్డన్ సంగీత దర్శకుడు, యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రాఫర్. టి.ఎస్. సురేష్ ఎడిటర్.