డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్ తన ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు అలాగే సిరీస్‌ల గురించి కొన్ని ఊహించని ప్రకటనలతో ప్రేక్షకులను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఇప్పుడు “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్” పేరుతో కొత్త సిరీస్‌తో ముందుకు వచ్చారు.
ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ను వినాయక చవితి సందర్భంగా లాంచ్ చేశారు. సెప్టెంబర్ 20, 2024న హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది.
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్వి మడివాడ, పావని రెడ్డి, సుధ, భాను చందర్, రాజ్ తిరందాసు, అజయ్ కతుర్వార్, ఆదర్శ్ బాలకృష్ణ మరియు అక్షర గౌడ తదితరులు నటిస్తున్నారు.
ఈ కొత్త థ్రిల్లర్ సిరీస్‌కి అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. శక్తి కాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా, నవీన్ యాదవ్ ఛాయాగ్రహణం అందించారు.