దర్శకుడు జీతూ జోసెఫ్ థ్రిల్లర్, అలాగే సస్పెన్స్ సినిమాలు చేయడంలో మాస్టర్. అయితే అతను ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేసిన కొత్త చిత్రం “నునాకుజి” మరొక జానర్, అదే క్రైమ్ కామెడీ.
ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించాడు. సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుండి కూడా ప్రశంసలు పొందింది. ఇంకా ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024న జీ5 OTT ప్లాట్‌ఫామ్‌లో మలయాళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
బాసిల్ జోసెఫ్‌తో పాటు ఈ చిత్రంలో గ్రేస్ ఆంటోని, నిఖిలా విమల్, సిద్దిక్, మనోజ్ కె జయన్, బైజు సంతోష్, అజు వర్గీస్, సైజు కురుప్, బిను పప్పు, అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్, అజీజ్ నేడుమంగడ్, సెల్వరాజ్, స్వాసిక, లీనా, కళాభవన్ యూసుఫ్, కళాభవన్ యూసుఫ్ భాసి, దినేష్ ప్రభాకర్, రాజేష్ పరవూర్, రియాస్ మరిమయం, జయకుమార్ పరమేశ్వరన్, సంతోష్ లక్ష్మణన్, మరియు శ్యామ్ త్రుక్కున్నప్పుజ.
విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రాఫర్, వినాయక్ వీఎస్ ఎడిటర్, విష్ణు శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్.