ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ బండి సరోజ్ కుమార్ బోల్డ్ చిత్రాలకు అలాగే ఆలోచింపజేసే డైలాగ్‌లకు పేరుగాంచారు. అతను తన యూట్యూబ్‌లో సినిమాలు చేసిన తర్వాత, ఇప్పుడు పరాక్రమం సినిమా ని థియేటర్ లో విడుదల చేశాడు.
అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయింది, ఇక ఇప్పుడు రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓట్ లోకి రాబోతోంది.
పరాక్రమం సినిమా సెప్టెంబర్ 14, 2024న ఆహా వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ నెక్కంటి తదితరులు నటించారు.
బండి సరోజ్ కుమార్ ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, ఎడిటర్ మరియు సంగీత దర్శకుడు. వెంకట్ ఆర్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్.