మలయాళ ఇండస్ట్రీ ఈ మధ్య కాలం లో కొన్ని కొత్త వెబ్ సిరీస్‌లను రిలీజ్ చేస్తుంది అందులో ఒకటే ఈ జై మహేంద్రన్. కొన్ని నెలల క్రితమే ఫస్ట్‌లుక్ విడుదలైంది కానీ విడుదల తేదీ ఆలస్యమైంది.
ఇప్పుడు, ఈ సిరీస్ OTT విడుదల తేదీని ప్రకటించారు. జై మహేంద్రన్ సోనీలీవ్ OTT ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 11, 2024న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంటుంది.
రాహుల్ రిజి నాయర్ మరియు శ్రీకాంత్ మోహన్ ఈ ధారావాహికకు కథ, స్క్రీన్ ప్లే అలాగే సంభాషణలు అందించారు. సిద్ధార్థ ప్రదీప్ సంగీతం అందించగా, ప్రశాంత్ రవీంద్రన్ ఛాయాగ్రహణం అందించారు, ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్ ఈ సిరీస్‌ని నిర్మించింది.
శైజు కురుప్, సుహాసిని మణిరత్నం, రాహుల్ రిజి నాయర్, మియా, సురేష్ కృష్ణ, జాన్ ఆంటోని, విష్ణు గోవిందన్, మణియన్ పిల్ల రాజు, సిద్ధార్థ శివ, బాలచంద్రన్ చుల్లికాడ్, అప్పున్ని శశి, జింజ్ షాన్, పౌలీ వల్సన్, రెంజిత్ శేఖర్ తదితరులు ఈ సిరీస్‌లో ఉన్నారు.