మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాతో బహుముఖ నటుడైన రావు రమేష్ హీరోగా మారాడు. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది ఇంక ఇప్పుడు ఈ కామెడీ సినిమా OTT లోకి వస్తోంది.
రావు రమేష్ ఎలాంటి క్యారెక్టర్ అయినా గొప్పగా నటించగలడు అలాగే అతను తన అద్భుతమైన నటనతో మనల్ని మెప్పించగలడు. చాలా సినిమాల్లో తక్కువ స్క్రీన్ టైమ్ వచ్చినా తన నటనతో మెప్పించి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ ని తన పెర్ఫార్మెన్స్ తో చంపేసాడు.
ఈ చిత్రం సెప్టెంబర్ 20, 2024 ఆహా వీడియోలో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ మరియు ఇతరులు నటించారు.
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: లక్ష్మణ్ కార్య, సంగీతం: కళ్యాణ్ నాయక్, కెమెరా: MN బాలరెడ్డి, నిర్మాత: బుజ్జి రాయుడు పెంట్యాల.