ఈ మధ్య కాలం లో ETV Win చాలా అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలని అలాగే సిరీస్ లని కూడా అందిస్తోంది. కమిట్ కుర్రోళ్లు వంటి విజయవంతమైన చిత్రాల డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.
సోపతులు అనే కొత్త చిత్రం ETV Win ఓటిటి ప్లాట్‌ఫామ్ లో రిలీజ్ అవుతుంది. సోపతులు నేరుగా ETV Winలో సెప్టెంబర్ 19, 2024న విడుదల చేస్తున్నారు.
సోపతులు సినిమా కథ ఏంటంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో జరిగే స్నేహం గురించిన కామెడీ-డ్రామా అని తెలుస్తోంది. ఈ చిత్రంలో భాను ప్రకాష్, సృజన్, మోహన్ బగత్, మణి ఏగుర్ల, అనూష రమేష్, అంజయ్య మిల్కూరి (అంజి మామ), సురభి లలిత, పద్మ నిమ్మనగోటి, రవీందర్ బొమ్మికంటి నటించారు.
ఈ చిత్రానికి అనంత్ వర్ధన్ దర్శకత్వం వహించగా, సునీల్ కె ముత్యాల ఛాయాగ్రహణం అందించారు, సింజిత్ యర్రమిల్లి సంగీతం సమకూర్చారు. వైల్డ్ వర్చు క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.