చెన్నైలోని డీమోంటి కాలనీ అనేది హాంటెడ్ ప్లేస్ అని నమ్ముతారు అలాగే 2015లో ఆ ప్లేస్ గురించి తీసిన సినిమాకి అద్భుతమైన స్పందన లభించింది. అయితే దర్శకుడు అజయ్ ఆర్. జ్ఞానముత్తు సీక్వెల్ కోసం 3 సంవత్సరాలకు పైగా పని చేసి “డెమోంటి కాలనీ 2” అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు.
డీమోంటి కాలనీ 2 తమిళ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది కానీ తెలుగులో అంతగా అలరించలేకపోయింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు Zee5 OTT ప్లాట్‌ఫామ్‌లో తమిళం మరియు తెలుగు ఆడియోలలో సెప్టెంబర్ 27, 2024న రిలీజ్ అవుతుంది.
ఈ ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్‌లో అరుళ్నితి, ప్రియా భవానీశంకర్, ఆంటీ జాస్కెలైన్, సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్ మరియు అర్చన రవిచంద్రన్ నటించారు.
అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జ్ఞానముత్తు పట్టరాయ్‌తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్, విజయ సుబ్రమణియన్, మరియు RC రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చగా, హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్.