వాజా: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ ఒక మలయాళ కామెడీ డ్రామా చిత్రం, ఈ సినిమా ఆగస్టు 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు అలాగే ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన అందుకుంది.
ఇప్పుడు, వాజా: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ OTT లోకి వస్తోంది, సెప్టెంబర్ 23న హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుంది. ఈ కామెడీ-డ్రామా మలయాళం లోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీలో కూడా అందుబాటులో ఉంటుంది.
జయ జయ జయ హే, గురువాయూరంబాల నడాయిల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విపిన్ దాస్ ఈ చిత్రానికి కథ రాశారు.
ఈ చిత్రంలో జగదీష్, కొట్టాయం నజీర్, అజీస్ నెడుమంగడ్, నోబీ మార్కోస్, సిజు సన్నీ, అమిత్ మోహన్ రాజేశ్వరి, జోమోన్ జ్యోతిర్, అనురాజ్ ఓ.బి, సాఫ్‌బోయ్, అన్షిద్ అను, శృతి మణికందన్, మీనాక్షి ఉన్నికృష్ణన్, జియా విన్సెంట్, స్మిను, హహిర్, ప్రియా అస్విన్ సిజో, విజయన్ నటించారు.
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: విపిన్ దాస్, దర్శకత్వం ఆనంద్ మీనన్, అరవింద్ పుతుస్సేరి ఛాయాగ్రహణం అందించగా అంకిత్ మీనన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని విపిన్ దాస్, హారిస్ దేసోమ్, పి.బి. అనీష్, ఆదర్శ్ నారాయణ్ మరియు ఐకాన్ స్టూడియోస్ నిర్మించారు.