ఈ మధ్య కాలం లో జియో సినిమా బ్యాక్ టు బ్యాక్ ఒరిజినల్ సినిమాలు అలాగే సిరీస్‌లతో మన ముందుకు వస్తోంది. అలాంటి వాటిలో ఈ హనీమూన్ ఫోటోగ్రాఫర్ కూడా ఒకటి.
ఈ సిరీస్ ట్రైలర్, అలాగే విడుదల తేదీని జియో సినిమా వాళ్ళు అనౌన్స్ చేసారు. ఈ సిరీస్ థ్రిల్లర్ డ్రామాగా కనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మరి చూడాలి ఎలా ఉంటుందో.
హనీమూన్ ఫోటోగ్రాఫర్ సెప్టెంబర్ 27, 2024న జియో సినిమాలో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ లో ఆశా నేగి, అపేక్ష పోర్వాల్, రాజీవ్ సిద్ధార్థ, సాహిల్ సలాథియా, జాసన్ థామ్, సుష్మిత శెట్టి, సంవేద సువాల్కా మరియు ఇతరులు నటించారు..
అర్జున్ శ్రీవాస్తవ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. జియో సినిమా నిర్మించింది.