దర్శకుడు వివేక్ ఆత్రేయ, నటుడు నాని కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం “అంటే సుందరానికి” థియేటర్లలో అనుకున్నంత మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అలాగే వీళ్లిద్దరు కలిసి చేసిన లేటెస్ట్ చిత్రం “సరిపోదా శనివారం”. ఈ సినిమా ఈ మధ్యే థియేటర్లలో విడుదలైంది 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించింది.
థియేటర్లలో విజయవంతంగా ఆడింది అలాగే ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన స్పందన పొందింది, ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 26, 2024న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుంది. ఇది తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల అవుతుంది.
ఈ చిత్రంలో నానితో పాటు, ఎస్‌జె సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, సాయికుమార్, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, అజయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, శివాజీ రాజా, సుప్రీత్, విష్ణు ఓయి, ఝాన్సీ మరియు మరికొందరు నటించారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి ధనయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు.