కల్కి తర్వాత ఈ ఏడాది వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో సినిమా చుట్టూ చాలా హైప్ ఉంది. ఇంకా జాన్వీ కపూర్ కూడా హీరోయిన్‌గా తెలుగు లో మొదటి సినిమా చేసింది అలాగే విలన్‌గా సైఫ్ అలీఖాన్ కూడా. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే, మరి ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
సినిమా కథ విషయానికి వస్తే, ఎర్ర సముద్రం సమీపంలోని రత్నగిరి అనే తీర గ్రామం నేపథ్యంలో, మురుగ (మురళీ శర్మ) ఆధ్వర్యంలో దేవర (జూనియర్ ఎన్టీఆర్), భైరా (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్) మరియు ఇతర గ్రామ ప్రజలు, సముద్రం నుండి సరుకుని దొంగతనం చేస్తుంటారు. అయితే అంత సాఫీగా సాగిపోతున్న సమయంలో, భైరా, రాయప్ప, కుంజరః మరియు ఇతరులకి, దేవర అంటే భయం మొదలవుతుంది. ఎందుకు అనేది సినిమాలో చూడాలి.
కథ మొదలైన విధానం గాని, మొదటి సగంలో మంచి డ్రామా, అద్భుతమైన యాక్షన్, డాన్స్ అన్ని సరిగ్గా కుదిరాయి. ఇక సముద్రం నేపథ్యం కూడా కొత్తగా ఉండడంతో ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది. అయితే మొదటి సగం ఎంత బాగుందో, రెండవ భాగం అంత దారుణంగా ఉంది. అసలు రెండవ భాగంలో కథనదే లేదు, ఒక్క చివరి 10 నిమిషాలు తప్ప, సాగదీసినట్టు అనిపించింది రెండవ భాగం అంత.
జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలలో అద్భుతంగా నటించాడు, జాన్వీ కపూర్, ఆమె తెలుగులో మొదటి సినిమా, చాల తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పాత్రను పోషించింది,కానీ ఉన్నంతలో బాగా చేసింది. అయితే శ్రీకాంత్ పాత్ర నిరాశపరిచింది. భైరా గా సైఫ్ అలీ ఖాన్ బాగా చేసాడు, చాల ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది మరియు తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ మరియు అభిమన్యు సింగ్ అక్కడక్కడా కనిపించారు. మిగతా నటీనటులు వారి పాత్రకు తగినట్టుగా నటించారు.
సినిమాకి మేజర్ హైలట్, ఛాయాగ్రహణం, రత్నవేలు గారి ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కూడా చాల బాగా ఇచ్చాడు అనిరుద్.
కొరటాల శివ డైరెక్టర్ గా పాక్షికంగా విజయం సాధించాడని చెప్పొచ్చు దానికి కారణం సెకండ్ హాఫ్. కానీ ఏది ఏమైనా, ఒక కొత్త ప్రపంచంలోకి అయితే తీసుకెళ్లాడు.
మొత్తమీద, దేవర కథ మామూలుగానే ఉన్న, కొన్ని సన్నివేశాల కోసం మరియు N.T.R కోసం చూడొచ్చు.